Andhra
సమీర్ హంజను ఘనంగా సన్మానించిన బ్రైట్ హోరిజోన్ ఫౌండేషన్
Shot News: గుంటూరు లోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ షాదిఖానా నందు ఈ సంవత్సరం పదో తరగతి మరియు ఇంటర్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అత్యధిక మార్కులు సాధించిన పేద విద్యార్థులను ప్రోత్సహించడానికి “బ్రైట్ హారిజన్స్ అకడమిక్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 “ఏర్పాటు చేసిన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసి సంస్థ కార్యక్రమాలకు ఆర్థిక సహాయం అందిస్తున్న సమీర్ హంజాను ఘనంగా బ్రైట్ హారి జాన్స్ ఫౌండేషన్ ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ ఎం కె ఎస్ మొయుద్దిన్ మాట్లాడుతూ తమకు అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తున్న సమీర్ హంజా లాంటి వారి వల్లే తాము కార్యక్రమాలు చేయగలుగుతున్నామని అన్నారు.తమ సంస్థ ద్వారా నాలుగు సంవత్సరాల నుండి పేద విద్యార్థులకు నీట్ కోచింగ్ ఇస్తూ వారికి ప్రోత్సహిస్తున్నామని, ఈ సంవత్సరం కూడా 15 మంది డాక్టర్లుగా తమ భవిష్యత్తును తీర్చుకో బోతున్నారని, తాము ఇప్పటివరకు 60 మంది డాక్టర్లను తయారు చేశామని, కుల మతాలకు అతీతంగా వైద్య శిబిరాలు, పేదవారికి తమ కాళ్ళపై వారు నిలబడే లాగా కిరాణా కొట్టు పెట్టుకోవడానికి ఆర్థిక సహాయాలు, పండగ వేళ పండగ జరుపుకోవడానికి నిత్యవసర సరుకులు తమ సంస్థ ద్వారా అందిస్తున్నట్లు ఈ కార్యక్రమానికి సమీర్ హంజా తోడ్పాటు అందిస్తున్నారని ఆయన అన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ మైనార్టీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ముహమ్మద్ షరీఫ్, హసన్ అహ్మద్, డాక్టర్ కాలేషావలి. సంస్థ ప్రధాన కార్యదర్శి సయ్యద్ చాంద్ బాషా లు ఉన్నారు.
![]()
