Andhra
ఘనంగా మాదిగ ఉత్తమ ఉద్యోగుల సన్మాన సభ..
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు మాదిగ ఉత్తమ ఉద్యోగుల మరియు పదోన్నతులకు సన్మాన కార్యక్రమం మార్కాపురం మాదిగ ఉద్యోగుల సంఘం మరియు ఎంఆర్పిఎస్, మహాజన సోషలిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎంఈఎఫ్ మార్కాపురం అధ్యక్షుడు ఏలియా ఆధ్వర్యంలో నిర్వహించగా సభ అధ్యక్షుడిగా జిల్లా ఎం ఈ ఎఫ్ ప్రధాన కార్యదర్శి జీవ రత్నం అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి మాదిగ ఉద్యోగుల సంఘం జాతీయ నాయకులు బొంత యేసుదాసు మాదిగ పాల్గొని మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఉద్యోగులు మాదిగ ఉద్యోగులంతా ఐక్యత కలిగి మన సంఘం బలోపేతానికి కృషి చేయాలని తెలిపారు. అనంతరం ఈ సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున 79 వ స్వాతంత్ర దినోత్సవం రోజు మంత్రి బాల వీరాంజనేయ స్వామి మరియు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగులుగా అవార్డు గ్రహీతలకు మరియు కానిస్టేబుల్ మరియు టీచర్స్ నుండి హెచ్ఎమ్ కు పదోన్నతి పొందిన హెచ్ఎం ఏలియా, అంగన్వాడీ సూపర్వైజర్ బి.జ్యోతి, వార్డెన్, కాశయ్య, హెచ్ఎం, శ్యామ్ సుధాకర్, వీఆర్ఏ రాజేష్, ఉద్యోగులకు మేమెంటో తో, మరియు దృశ్యాలువ పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు పందిటి కాశి రావు మాదిగ, మాదిగ ఉద్యోగుల సంఘం నాయకులు ఎస్సీ కుమార్, సంజీవయ్య, జోసెఫ్, హానోజీరావు, లూకా, చార్లెస్, ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి, నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.
![]()
