ఒంగోలు: ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్స్ ఒంగోలులో పోలీస్ కార్యాలయంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం ఎస్పీ దామోదర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాలు అనంతరం పోలీస్ సిబ్బందికి ప్రసాదాన్ని ఎస్పీ అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.