Connect with us

Andhra

జంగిల్ క్యాట్ ను రక్షించిన గ్రామస్తులు..

Published

on

ప్రకాశం జిల్లా కొమరోలు మండలం హస్తనాపురం గ్రామ ప్రజలు జంగిల్ క్యాట్ ను రక్షించారు. మొదట అచ్చం చిరుత పులి లక్షణాలు ఉన్న జంతువుల భావించిన గ్రామస్తులు చిరుతపులి పిల్ల అనుకొని అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. గ్రామస్తులు బంధించి ఉంచిన జంగిల్ క్యాట్ ను అటవీశాఖ అధికారులు తమ శాఖ కార్యాలయానికి తరలించారు. అయితే అక్కడ పరీక్షించిన వెటర్నరీ అధికారులు, అటవీ శాఖ అధికారులు అది చిరుత పులి పిల్ల కాదని జంగిల్ క్యాట్ గా నిర్ధారించారు. తోటి జంతువులు జంగిల్ క్యాట్ పై దాడి చేయడంతో అది తీవ్రంగా గాయపడి ఉన్నట్లుగా వెటర్నరీ అధికారులు గుర్తించారు. వెంటనే దానికి వైద్యం అందించి తమ సంరక్షణలో ఉంచుతున్నట్లు అధికారులు తెలిపారు. కోలుకున్న అనంతరం జంగిల్ క్యాట్ ను నల్లమల అటవీ ప్రాంతంలో విడిచిపెడతామని అధికారులన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.