Andhra
ఘనంగా జరిగిన బ్రైట్ హారిజన్స్ అకడమిక్ ఎక్సలెన్స్ అవార్డ్స్ కార్యక్రమం
Shot News: ఈ రోజు గుంటూరు లోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ షాదిఖానా నందు ఈ సంవత్సరం పదో తరగతి మరియు ఇంటర్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ప్రోత్సహించడానికి “బ్రైట్ హారిజన్స్ అకడమిక్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 “ఏర్పాటు చేసిన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రత్యేక అతిధులు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ బ్రైట్ హారి జాన్స్ ఫౌండేషన్ కార్యక్రమాలు ప్రతి జిల్లాకు, మండలానికి చేరాలని ఆకాంక్షించారు. మరో అతిధి తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడుతూ జీవితంలో విజయం సాధించిన వారు సమాజ అభివృద్ధికి బిహెచ్ఎఫ్ సంస్ట చేస్తున్న కార్యక్రమాలు లాగా చేయటానికి ముందుకు రావాలని అప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు. బిహెచ్ఎఫ్ సంస్థ చైర్మన్ మాట్లాడుతూ ప్రతిభావంతులైన 100 మంది విద్యార్థులను ఎంపిక చేసి వారికి నగదు ప్రోత్సాహం కార్యక్రమం తమ సంస్థ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది అని, ప్రతి సంవత్సరం ఇలాగే తాము ప్రోత్సాహక కార్యక్రమం నిర్వహించాలి అని అనుకుంటున్నట్లు ఆయన షార్ట్ న్యూస్ కు తెలిపారు. ప్రసంగాల అనంతరం అనంతరం విద్యార్థులకు అతిథులు మరియు డోనర్స్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ చేశారు. వర్షం ఉన్న కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలకు సంస్థ ప్రధాన కార్యదర్శి సయ్యద్ చాంద్ బాషా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిహెచ్ఎఫ్, ఉపాధ్యక్షులు ఇక్బాల్ , డైరెక్టర్లు సలీం భాష, డాక్టర్ కాలేషా వలి, షేక్ హసన్, జిలానీ, అన్సర్ బాబు, సిరాజ్, కువైట్ షరీఫ్, అబిద్ బాషా, వలి, హుస్సేన్, అమిర్ హంజా, సలీం, ప్రొఫెసర్ జానీ భాష, షేక్ ముస్తఫా తో పాటు బిహెచ్ఎఫ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
![]()
