Andhra
బోధి పాఠశాలలో గణేశుడి నమూనా విగ్రహ తయారీ పోటీ
Shot News: వినాయక చవితి సందర్భంగా బోధి పాఠశాలలో గణేశ విగ్రహ నమూనా తయారీ పోటీ ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలో వివిధ తరగతుల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ కళాత్మక ప్రతిభను ప్రదర్శించారు. పర్యావరణ హితంగా ఉండేలా మట్టి, ఆకులు, పప్పులు, ధాన్యాలు, రంగు కాగితాలు, పూలు వంటి సహజ పదార్థాలను వినియోగించి అద్భుతమైన గణేశ విగ్రహాలను తయారు చేశారు.ఈ పోటీ వినాయక చవితి ముందస్తు వేడుకలలో భాగంగా నిర్వహించబడింది. సాంప్రదాయం, సృజనాత్మకత, పర్యావరణ పరిరక్షణ – ఈ మూడింటినీ ఒకే వేదికపై కలిపిన ప్రత్యేకమైన కార్యక్రమంగా నిలిచింది. ఈ పోటీలో పాల్గొన్న వారందరినీ పాఠశాల యాజమాన్యం ప్రశంసా పత్రం తో పాటువిజేతలకు బహుమతులు అందజేశారు, ఈ కార్యక్రమం తో విద్యార్థుల్లో పండుగ వాతావరణం నెలకొని, గణనీయమైన ఉత్సాహం కనబరిచారు. యాజమాన్యం ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థులలో సృజనాత్మకత, సంప్రదాయాల పట్ల గౌరవభావం పెంపొందిస్తాయని పేర్కొంది. ఈ కార్యక్రమం లో పాఠశాల యాజమాన్యం, అధ్యాపక బృందం మరియు విద్యార్థిని, విద్యార్థులు అత్యంత ఉత్సాహం తో పాల్గొన్నారు. విద్యార్థులకు కార్యక్రమం అనంతరం యాజమాన్యం స్వీట్స్ పంచారు.
![]()
