Andhra
కర్నూలు: ఒకే ఇంట్లో ముగ్గురికి టీచర్ ఉద్యోగాలు
కల్లూరు మండలం ఉలిందకొండ గ్రామానికి చెందిన మన్సూర్ బాషా, జిలాని బేగం దంపతులకు చెందిన ముగ్గురు పిల్లలు డీఎస్పీ మెరిట్ లిస్టులో ఉద్యోగాలు సాధించారు. మొహమ్మద్ హనీఫ్ 79.67, హసీనా బాను 81.62, హరూన్ రషీద్ 84.11 మార్కులతో ఉపాధ్యా యులుగా ఎంపికయ్యారు. వీరిని గ్రామస్థులు అభినందించారు. తమ తల్లిదండ్రులు కష్టపడి చదివించారని, వారి కష్టం వృథా కాలేదని పిల్లలు పేర్కొన్నారు.
![]()
