Andhra
కర్నూలులో ఆంధ్ర విద్యా ఉద్యమం పోస్టర్ ఆవిష్కరించిన SIO రాష్ట్ర అధ్యక్షులు..
కర్నూలు: స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (SIO) ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో “ఆంధ్ర విద్యా ఉద్యమం – అన్వేషించండి | ప్రోత్సహించండి | సాధికారత” ను శనివారం కర్నూలులో ప్రెస్ మీట్ ద్వారా ప్రారంభించారు. ఆగస్టు 15 నుండి సెప్టెంబర్ 30 వరకు జరగబోయే ఈ ఉద్యమంపై SIO రాష్ట్ర అధ్యక్షుడు బ్రదర్ అమీర్ ఫహద్ మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ.. నాయకులు రాష్ట్ర విద్యా విధానం, బడ్జెట్ కేటాయింపులు, విద్యా హక్కు చట్టం (RTE) అమలు, ఉన్నత విద్య వంటి అంశాలపై దృష్టి సారించారు. ప్రెస్ మీట్ అనంతరం ప్రతినిధులు డా. అబ్దుల్ హక్ ఉర్దూ విశ్వవిద్యాలయం, ఉస్మానియా కళాశాల, ఐడియల్ స్కూల్లను సందర్శించి, ఆయా సంస్థల బాధ్యులతో విద్యా సమస్యలు మరియు అభివృద్ధి అవసరాలపై చర్చించారు.
ఈ కార్యక్రమంలో SIO రాష్ట్ర అధ్యక్షుడు బ్రదర్ అమీర్ ఫహద్, జిల్లా నిర్వాహకుడు (చిత్తూరు–అన్నమయ్య) బ్రదర్ అబ్దుల్ ముజీబ్ ఖాన్, బ్రదర్ మాన్సూర్, బ్రదర్ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.
![]()
