Connect with us

Andhra

డాక్టర్ల PG కోటా 20 శాతం కొనసాగించాలి.. డాక్టర్ కె రాహూల్

Published

on

ఒంగోలు: రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పని చేస్తున్న ఇన్సర్విస్ డాక్టర్ల పీజీ కోటాను 20 శాతం నుండి 15 శాతానికి తగ్గించడాన్ని నిరసిస్తూ, ప్రస్తుతం అమలవుతున్న 20 శాతాన్ని యధాతధంగా కొనసాగించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు డాక్టర్. కాటమాల రాహుల్ వారి అసోసియేషన్ సభ్యులతో కలిసి ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్స్ ఒంగోలులో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ టి వెంకటేశ్వర్లుకి వినతి పత్రం సమర్పించారు. కేవలం 7 శాఖలలో సర్వీసు కోట కాకుండా గతంలో మాదిరిగా అన్ని శాఖలలో సర్వీస్ కోట అమలయ్యేలా చూడాలని జనరల్ సెక్రటరీ డాక్టర్. ఖాదర్ మస్తాన్ బి తెలిపారు. గత సంవత్సరం చర్చల సందర్భంగా ఇచ్చిన హామీలో భాగంగా సర్వీస్ కోట తగ్గించే ఉద్దేశం ఉన్న యెడల అసోసియేషన్ ప్రతినిధులతొ సంప్రదింపులు జరిపిన తరువాత మాత్రమే తగ్గింపు నిర్ణయం తీసుకుంటామని ఇచ్చిన హామీని ప్రభుత్వం విస్మరించి ఇప్పుడు ఏకపక్షంగా సర్వీస్ కూడా తగ్గించడం బాధాకరమని ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సుందర్ ప్రసాద్ అన్నారు. గిరిజన, పల్లె ప్రాంతాల్లో సంవత్సరాలుగా పనిచేస్తున్న మెడికల్ ఆఫీసర్ల కెరీర్ పై సర్వీస్ కోట తగ్గింపు నిర్ణయం అశనిపాతమని అసోసియేషన్ సభ్యులు డాక్టర్ నబీవలి అన్నారు. ప్రస్తుతం అమలవుతున్న 20 శాతం సర్వీస్ కోటాను యధాతరంగా కొనసాగించాలని డాక్టర్ కుమారస్వామి ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పలు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.