Connect with us

Andhra

విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి..

Published

on

ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజక వర్గం పరిధిలోగల 6 నుండి 17 సంవత్సరాల దివ్యాంగుల విద్యార్థులకు ఉచిత ఉపకరణాల కోసం స్క్రీనింగ్ సెంటర్లును నియోజకవర్గ శాసన సభ్యులు కందుల నారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నారాయణ రెడ్డి మాట్లడుతూ.. ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులుకు భవితి సెంటర్లను నిర్మించి, స్పీచ్ థెరివి, ప్రత్యేక బోధనా పద్ధతుల ద్వారా బోధించడం జరుగుతుందని, వీరికి భవిత కేంద్రంలో ఫిజియోథెరపీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని అదేవిధంగా ట్రాన్స్పోర్ట్, ఎస్కార్ట్, గర్ల్స్ కు స్టైఫండ్ , అలవెన్సెస్ కూడా అందిస్తుందని వివరించారు. అలాగే ఈ స్క్రీనింగ్ వలన డాక్టర్లు వైకల్యాలను గుర్తించి వివిధ రకాల ఉపకరణాలు బ్రెయిలీ కిట్స్,, ట్రైసైకిళ్లు అందిస్తారని. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి, మరియు ఎంఈఓలు రామదాసు నాయక్, శ్రీమతి శార్వాణి మేడం మరియు జిల్లా సహిత విద్య సమన్వయ కర్త శ్రీ నాగేంద్ర నాయక్, సంహిత వైద్య ఉపాధ్యాయుడు వరిమడుగు వెంకట రామిరెడ్డి, భవిత సెంటర్ ఉపాధ్యాయులు ఎన్ లక్ష్మీదేవి, డి శ్రీనివాసులు మరియు నియోజకవర్గ సహిత విద్య ఉపాధ్యాయులు దివ్యాంగులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.