Connect with us

Andhra

సకాలంలో స్పందించి ఆత్మహత్య చేసుకోబోతున్న వ్యక్తి ప్రాణాలు కాపాడిన ప్రకాశం జిల్లా పోలీసులు..

Published

on

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణానికి చెందిన తన్నీరు సురేంద్ర (వయస్సు: 33 సంవత్సరాలు) అనే వ్యక్తి కుటుంబ సమస్యల కారణంగా శనివారం ఉదయం “తాను చనిపోతున్నానని చెప్పి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి, రైల్వే ట్రాక్ వైపు వెళ్లాడని బంధువుల నుంచి సమాచారం అందుకున్న ప్రకాశం పోలీసులు మార్కాపురం రూరల్ పోలీస్ స్టేషన్ కు తెలియజేశారు. వెంటనే మార్కాపురం డీఎస్పీ యు నాగరాజు,పట్టణ సీఐ పి సుబ్బారావు ఆదేశాల మేరకు, గ్రామీణ ఎస్ఐ అంకమ్మరావు మరియు సిబ్బంది, ఐటీ కోర్ టీం సాయంతో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సురేంద్ర ఉన్న ప్రదేశాన్ని గుర్తించి ఆ వ్యక్తి ప్రాణాలను కాపాడారు. అనంతరం అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

వెంటనే స్పందించి సదరు వ్యక్తి యొక్క ప్రాణాలను చాకచక్యంతో కాపాడిన పోలీసులకు అతని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. విధి నిర్వహణలో మంచి పనితీరు కనబర్చిన మార్కాపురం రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ అంకమ్మరావు మరియు కానిస్టేబుల్స్ కాశీ రావు, రంగనాయకులుకు మరియు ఐటి కోర్ సిబ్బందిని ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ అభినందించారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.