Connect with us

Andhra

హత్య కేసు కొట్టివేత..

Published

on

తేది 18 -08-2025 అనగా సోమవారం, ప్రకాశం జిల్లా దోనకొండ మండలం, మల్లంపేట గ్రామం కాపురస్థుడయిన వడ్లముడి చిన్న వెంకటేశ్వర్లుపై దోనకండ పోలిస్ వారు పెట్టిన హత్యకేసును కొట్టివేస్తూ.. మార్కాపురం ఆరవ అదనపు జిల్లా జడ్జి శ్రీమతి M. శుభవాణి తీర్పు చెప్పారు.

వివరాలలోకి వెలితే 2016 వ సంవత్సరం ఆగస్ట్ 2 వ తేది సాయంత్రం 7.30 గంటల సమయలో మృతుని తల్లి నేతుల బాలకటమల తన కుమారుడయిన నేతుల గోపికిృష్ణకు డబ్బులు ఇచ్చి రిచార్జ్ కార్ట్ తీసుకుని రమ్మని బజారుకి పంపగా మృతుడు గోపిక్రిష్ణ తిరిగి ఇంటికి రాలేదు. మృతుని తల్లిదండ్రులు రాత్రంతా మృతుడు గోపిక్రిష్ణను బంధువుల ఇళ్ళలో, పరిసర ప్రాంతాల్లో వెతికినా కూడ అతని ఆచూకి లభించలేదు. ఆ తరువాత 2016 ఆగస్ట్ 7 న ఉదయం 11 గంటల సమయంలో గ్రామస్థుల ద్వారా సమాచారం వచ్చినందున తండ్రి పెద్ద పోలయ్య బందువుల సహయంతో కలిసి వెళ్ళి, పొలాల మద్య ఉన్న దారిలో మృతుడు గోపిక్రిష్ణ మృతదేహం కనిపెట్టారు. దోనకొండ పోలిస్ వారు సదరు గోపిక్రిష్ణ మృతిని అనుమానస్పద మృతిగా పరిగణించి Cr: No: 54/2016 v/s 174 cr.p.c క్రింద కేసు నమోదు చేసి సాక్షులను విచారించగా ముద్దాయి వడ్లముడి వెంకటెశ్వర్లు ఈ హత్య చేసివుంటాడని అందుకు కారణం తన మేనమామ గురవయ్య కూతురు అయిన సపుజాతో చనువుగా వుండటం అని, కాబట్టి ముద్దాయి గోపికృష్ణను హత్యచేసి ఉంటాడని దొనకాండ పోలిసులు నిందితునిపై చార్జిషట్ దాఖలు చేశారు. సదరు కేసుపై 23 మంది సాక్ష్యాలను విచారించిన గౌరవ ఆరవ అదనపు జిల్లా జడ్డి M. శుభవాణి, ముద్దాయిపై నేరం బుజువు కానందున.. నిర్దోషిగా పేర్కొని కేసును కోట్టివేస్తూ తీర్పు చెప్పారు. నిందితుని తరుపున న్యాయవాది మొగల్ అన్వర్ బేగ్ వాదించారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.