Connect with us

Andhra

ఉత్తమ సేవల ప్రశంసా పత్రము పొందిన హకీమ్ కి ఘన సన్మానం చేసిన ఎంపీజే

Published

on

ఖమ్మం : తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు,ఎంపిజే కోశాధికారి ఎండి హకీమ్ ని మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సభ్యులు, జిల్లా అధ్యక్షులు ఎస్. కే. ఖాసిమ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. స్వాతంత్య్ర దినోత్సవం, ఆగస్టు 15 సందర్భంలో, ఖమ్మం నగర పాలక సంస్థ మేయర్ పునకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, మునిసిపల్ కమీషనర్ అగస్త్య చేతుల మీదుగా, హకీమ్ కి ఉత్తమ సేవల ప్రశంసా పత్రం అందజేయ బడింది. ఈ ఘనతను పురస్కరించుకొని, ఎంపిజే సభ్యులు ప్రత్యేక సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఎంపిజే అధ్యక్షులు షేక్ ఖాసీమ్, ఉపాధ్యక్షులు ఎండి. జహీర్, ఎండి. రజబాలి, కార్యదర్శులు సయ్యద్ రఫీక్, బి. సతీష్ చౌదరి, సభ్యులు ఎండి. గఫార్, ఎస్. కె. హుసేన్ మియా, ఎండి. ఎమ్మాద్, రహేమాన్ తదితరులు పాల్గొన్నారు

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.