Andhra
“విద్యా ఉద్యమం-అన్వేషించండి” SIO పోస్టర్ ఆవిష్కరించిన యాసిన్..
స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ “విద్యా ఉద్యమం- అన్వేషించండి | ప్రోత్సహించు | సాధికారత” ఉద్యమ పోస్టర్ ఆవిష్కరణను SIO జిల్లా అధ్యక్షుడు యాసీన్ నెలన్నర పాటు జరిగే ఈ ఉద్యమ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈసందర్భంగా యాసీన్ మాట్లాడుతూ.. ఈ ఉద్యమం ప్రచారంలో భాగంగా SIO- AP విద్యార్థులను ఉన్నత విద్య మరియు అకడమిక్ ఎక్సలెన్స్ కోసం ప్రేరేపిస్తుందని, పాఠశాలలు మరియు కళాశాలల నుండి ఎటువంటి డ్రాపవుట్‌లు లేకుండా విద్యను అభ్యసించేలా విద్యార్థులను ప్రేరేపించడానికి ప్రయత్నిస్తామని, అలాగే RTE, రాష్ట్ర విద్యా విధానం మరియు ఫీజు క్రమబద్ధీకరణ కార్యక్రమాలను సక్రమంగా అమలు చేయాలని SIO-AP ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామని తెలిపారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో బనగానపల్లె అధ్యక్షులు ఫయాజ్, స్థానిక సభ్యులు అవేజ్, జహీర్, తౌఫిక్ తదితరులు పాల్గొన్నారు.
![]()
