Andhra
“విద్యా ఉద్యమం-అన్వేషించండి” SIO పోస్టర్ ఆవిష్కరించిన ముఫ్తీ సయ్యద్ సాఖిబ్ మసూమ్
స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ “విద్యా ఉద్యమం- అన్వేషించండి | ప్రోత్సహించు | సాధికారత” ఉద్యమ పోస్టర్ ఆవిష్కరణను జమియతే ఉలమా హింద్ ప్రధాన కార్యదర్శి ముఫ్తీ సయ్యద్ సాఖిబ్ మసూమ్ సాహబ్ మరియు జమాతే ఇస్లామీ హింద్ అన్నమయ్య జిల్లా బాధ్యులు యం.ఆజం అలీ ఖాన్, SIO రాష్ట్ర అధ్యక్షులు బ్ర. అమీర్ ఫహద్ మరియు జిల్లా ఆర్గనైజర్ బ్ర. అబ్దుల్ ముజీబ్ ఆధ్వర్యంలో నెలన్నర పాటు జరిగే ఈ ఉద్యమ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈసందర్భంగా అమీర్ ఫహద్ మాట్లాడుతూ.. ఈ ఉద్యమ ప్రచారంలో భాగంగా SIO- AP విద్యార్థులను ఉన్నత విద్య మరియు అకడమిక్ ఎక్సలెన్స్ కోసం ప్రేరేపిస్తుందని, పాఠశాలలు మరియు కళాశాలల నుండి ఎటువంటి డ్రాపవుట్‌లు లేకుండా విద్యను అభ్యసించేలా విద్యార్థులను ప్రేరేపించడానికి ప్రయత్నిస్తామని, అలాగే RTE, రాష్ట్ర విద్యా విధానం మరియు ఫీజు క్రమబద్ధీకరణ కార్యక్రమాలను సక్రమంగా అమలు చేయాలని SIO-AP ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామని తెలిపారు.
![]()
