Andhra
జిల్లా స్థాయి వక్తృత్వ పోటీల్లో మార్కాపురం విద్యార్ధిని షేక్ ఫర్హాన రెండవ బహుమతి..
ప్రకాశం జిల్లా మార్కాపురం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినికి ద్వితీయ బహుమతి. ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో “భారత రాజ్యాంగం – కనీసం అవగాహన” అనే అంశంపై జూలై 25 న ఒంగోలులో నిర్వహించిన జిల్లా స్థాయి వక్తృత్వ పోటీలో మార్కాపురం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థిని షేక్ ఫర్హాన ద్వితీయ స్థానం పొంది రూ 5000.00 నగదు బహుమతి సాధించింది.
‡స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఒంగోలులో జరిగిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో ప్రముఖుల చేతుల మీదుగా బహుమతి అందుకొన్నది. రూ 5000.00 నగదు బహుమతి తోపాటు ప్రశంసాపత్రం మరియు శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయని, ఉపాధ్యాయులు మరియు పాఠశాల సిబ్బంది షేక్ ఫర్హానను అభినందించారు.
![]()
