Andhra
గాంధీజీ కలలు గన్న స్వరాజ్యం కోసం మనమందరం పనిచేయాలి :ఎంపీజే సలీమ్
ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 78 సంవత్సరాలు ముగించుకొని 79వ సంవత్సరములోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా ఎంపీజే ఆధ్వర్యంలో స్థానిక జిన్నా రోడ్డు లోని ఎంపీజే ఆఫీసు నందు జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సలీం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్రం వచ్చిది 1947కు ముందు భారత దేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తూ మనల్ని బానిసలుగా చూస్తూ చిత్రహింసలకు గురి చేస్తూన్నా బ్రిటిష్ వారి దౌర్జన్యాలను చూసి పితామహుడు మహాత్మా గాంధీ, చంద్రశేఖర్ ఆజాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్,అష్ఫా ఖుల్లా ఖాన్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, బహదూర్ షా జాఫర్, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్,అబ్దుల్ గఫ్ఫార్ ఖాన్, మహిళలు సైతం బేగం హజరత్ మహల్, అబిదాబాను బేగం, హాజీర బీబీ ఇస్మాయిలి,రాణీ లక్ష్మీబాయి, కస్తూరిబాయి గాంధీ ఇలా ఎందరో బ్రిటిష్ వారితో పోరాడి తెల్ల దొరలను తరిమి కొట్టి దేశాన్ని కాపాడుకోగలిగారు.అలా అందరూ కలిసి మెలిసి పోరాడి భారతదేశాన్ని స్వాతంత్రం తెచ్చుకున్నారు. మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలి దేశంలో ఉండే ప్రతి ముస్లిం, హిందూ,క్రైస్తవులు, సిక్కలు, జైనులు కలసి ఒక రాజ్యాంగం తయారు చేసుకుని ప్రతి ఒక్కరికి ఈ దేశంలో స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది కుల మతాలకు అతీతంగా అందరికీ సమాన హక్కులు కల్పిస్తూ రాజ్యాంగంలో రాసుకున్నాము, కానీ పాలకులు తమ స్వార్థం కోసం కులాల మతాల మధ్య చిచ్చు పెట్టి పరిపాలిస్తూ బ్రిటీష్ వారికి ఏమాత్రం తీసిపోని విధంగా పరిపాలన చేస్తున్నారు. కానీ ఇప్పుడు మనం గాంధీజీ కలలు గన్న దేశాన్ని చూడలేకపోతున్నాము ఎప్పుడూ చూసిన ఏదో ఒక రాష్ట్రంలో అల్లర్లు సృష్టిస్తూ మణిపూర్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, గుజరాత్,బీహార్, లాంటి రాష్ట్రాలను అగ్నిగుండంలా తయారు చేశారు ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ను కూడా అగ్నిగుండంలా మార్చడానికి కొన్ని దుష్టశక్తులు పనిచేస్తున్నాయి. కావున పాలకులు పాలనపై దృష్టి పెట్టి అల్లరిముకల పని పట్టి శాంతియూత వాతావరణాన్ని కల్పించి భిన్నత్వంలో ఏకత్వంలా జీవించే లా అన్ని మతాల వారికి భరోసా కల్పించాలని పాలకులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీజే రాయలసీమ ఇన్చార్జి అయూబ్ ఖాన్, జిల్లా అధ్యక్షుడు జాకీర్ ఉమ్రి,పట్టణ అధ్యక్షులు హుస్సేన్ భాష,కార్యదర్శి మహమ్మద్ రఫీ,ఉపాధ్యక్షుడు నజీర్ అహ్మద్, మీడియా కార్యదర్శి అస్లం,జమాఅతే ఇస్లామీ సభ్యులు హుస్సేన్ అహ్మద్, పట్టణ అధ్యక్షులు షఫీ తదితరులు పాల్గొన్నారు.
![]()
