Andhra
మసీదుకు నిప్పు పెట్టిన మతోన్మాదులను కఠినంగా శిక్షించాలి..MPJ
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం దూపాడు గ్రామంలో అతి పురాతన మసీదుని 14వ తేదీ బుధవారం రోజు రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు మసీదులో జొరపడి నిప్పంటించారని తెలిసి నేడు శుక్రవారం యంపీజే ప్రతినిధి బృందం పర్యటించారు. ఈ సందర్భంగా మసీదు మొత్తం కలియతిరిగి సంఘటన గురించి స్థానికుల ద్వారా వివరాలు తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా యంపీజే రాష్ట్ర అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ.. నూట అరవై సంవత్సరాలు పూరతన చరిత్ర కలిగి, మత సామరస్యంతో వెళ్లివిరిసే, ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతంలో కొందరు మతోన్మాదులు మత సామరస్యాన్ని విచ్ఛిన్నం చేసెందుకు మసీదును టార్గెట్ చేసుకొని ఒక ప్రణాళిక ప్రకారం తాళాలు పగలగొట్టి, లోపల ప్రవేశించి మసీదుకు నిప్పంటించడం దుర్మార్గమని, ఇది ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వ నిఘా వ్యవస్థ విఫలంగా భావిస్తున్నామని, గత కొంత కాలంగా దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ..విలయం తాండవం చేస్తున్న ముష్కరులు, అదే విధంగా మన రాష్ట్రంలో కూడా మత సామరస్యాన్ని దెబ్బతీసెందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని ఈ సంఘటన ద్వారా నిరూపితం అయిందని, మళ్లీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిఘా సంస్థలను పటిష్టం చేసి, దీనికి సంబంధించిన ద్రోహులను గుర్తించి కఠినంగా శిక్షించాలని షేక్ అబ్దుల్ రజాక్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
![]()
