Connect with us

Andhra

ప్రెస్ క్లబ్ లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..

Published

on

ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతిపిత మహాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోస్ తదితర స్వాతంత్ర్య సమరయోధులు పోరాడి సాధించుకున్న దేశ స్వాతంత్య్రానికి నేటికీ 79 సంవత్సరాలు నిండాయని, స్వాతంత్ర్య సంగ్రామంలో మీడియా ముఖ్య పాత్ర పోషించిందని కొనియాడారు. ఈ కార్యక్రమానికి ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు మోహన్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి నేతృత్వం వహించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం జర్నలిస్టులు పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.