Andhra
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన సబ్ కలెక్టర్..
ప్రకాశం జిల్లా మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్. అనంతరం జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తదనంతరం స్వాతంత్ర్య సంగ్రామంలో ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు చేసిన కృషి గురించి విశదీకరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులు, సబ్ కలెక్టర్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
![]()
