Andhra
అధికారులకు ఇసుక లారీ, టిప్పర్ ఓనర్స్ వినతిపత్రం..
ప్రకాశం జిల్లా మార్కాపురం లారీ ఓనర్స్ కొంతమంది జిల్లా కలెక్టర్ మరియు డిఎస్పీ యు నాగరాజు తదితర అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఇందులో వారు లారీ అసోసియేషన్ కానీ టిప్పర్ అసోసియేషన్స్ 2020 నుంచి లేవలహని, మాకు మార్కాపురం శాండ్ యార్డుకు మేము ఇసుక రవాణా చేస్తున్నామని, అందుకు మాకు యార్డు వారు ఇచ్చు రేట్లకు సమ్మతించి మేము ఇసుక సప్లయ్ చేస్తున్నామని, మాకు ఇసుక డంప్ వారు ఎటువంటి ఇబ్బంది లేకుండా పైకం చెల్లిస్తుచున్నారని, అయితే గత కొన్ని రోజుల నుంచి లారీ ఓనర్స్ పలు ఊహాగానాలు చేస్తున్న కొందరి స్వార్ధం కోసం మిగిలిన లారీ ఓనర్స్ ను, టిప్పర్ ఓనర్స్ ను ఇబ్బందులకు గురి చేయుచున్నారని, అలాగే సమ్మెలో పాల్గొనాలని మమ్మల్ని ఇబ్బంది కలిగిస్తున్నందున మాకు ఈ సమ్మెకు ఎటువంటి సంబందం లేదని, ఇది రాజకీయ కుట్రగా పరిగణించి, మా లారీలను ఇసుక సరఫరా చేయుటకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా చూడాలని అధికారులను వారు కోరారు.
అయితే ఈ మధ్య కాలంలో ఇసుక లారీ, టిప్పర్ యజమానుల నుండి బలవంతంగా ఇసుకను డంపింగ్ యార్డ్ వారు తాము చెప్పిన రేటు ప్రకారం ఇవ్వాలని, లేదంటే బలవంతంగా దించుకుంటున్నందున, ఈ యజమానులు స్ట్రైక్ కు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అందులోని కొందరు ఇలా అధికారులకు వినతి పత్రాన్ని ఇవ్వడం ఇక్కడ గమనార్హం.
![]()
