Andhra
మిత్రులకు ఘన సన్మానం చేసిన గుజ్జనగుండ్ల వాకింగ్ ట్రాక్ అసోసియేషన్ సభ్యులు
గుజ్జనగుండ్ల వాకింగ్ ట్రాక్ పరిధిలో పదవీ విరమణ చేసిన మిత్రులుకు మరియు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మిత్రులకు గుంటూరులోని గుజ్జనగుండ్ల వాకింగ్ ట్రాక్ అసోసియేషన్ సభ్యులు ఘన సన్మానం చేశారు. సన్మానం అందుకున్న వారిలో వాసిరెడ్డి హనుమంతరావు, విజయశ్రీ తాళ్లూరి సాంబ, ఉమామహేశ్వరరావు, సుందరరావు ఉన్నారు.వీరికి ట్రాక్ అసోసియేషన్ అధ్యక్షులు బూసిరెడ్డి మల్లేశ్వర్ రెడ్డి, బండి అశోక్ రెడ్డి, IKV ప్రసాద్, మల్లికార్జున్, శ్రీనివాసరెడ్డిలు ఘన సన్మానం చేశారు. అనంతరం ట్రాక్ సభ్యులకు పుట్టినరోజు జరుపుకుంటున్న సభ్యులు అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సత్తార్, ప్రసాద్, చరణ్ ,రాంబాబు, తిరుమల శెట్టి శ్రీనివాసరావు, మదర్,రవి, కమల్, అమీర్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
![]()
