Connect with us

Andhra

శ్రీకృష్ణ సేవా సమితి సభ్యుల సేవా కార్యక్రమాలు అభినందనీయం.. పట్టణ CI సుబ్బారావు

Published

on

కృష్ణాష్టమి పండుగ సందర్భంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారిని గుర్తించి సోమవారం మార్కాపురం పట్టణంలో డి.ఇ.నాగ శేషు స్వగృహం నందు పేదలకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మార్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ పి.సుబ్బారావు హాజై మాట్లాడుతూ.. ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రాంతంలో శ్రీకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం పట్ల సభ్యులను CI పి సుబ్బారావు అభినందించారు. అనంతరం పదిమంది పేద ప్రజలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఇద్దరు పేద విద్యార్థులకు ఒక్కొక్కరికి 10000 చొప్పున 20000 రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగింది. హోం గార్డు కుమారుడి పై చదువుల కోసం పదివేల రూపాయలు మార్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు 10,000 ఆర్థిక సాయం అందించారు. మరో విద్యార్థి కుందూరు లలితకి ఇంటర్ పూర్తి చేసుకొని పై చదువులు చదవడానికి ఆర్థికంగా ఇబ్బందిగా ఉందని తెలుసుకున్న ప్రధానోపాధ్యాయుడు శ్రీరాములు పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. పదిమంది పేదలకి విశ్రాంతి ఉద్యోగి కడియం అల్లూరయ్య దుప్పట్లు పంపిణీ చేశారు. మరో విద్యార్థినీ కన్నెబోయిన రాధికకు పై చదువుల కోసం శ్రీ కృష్ణ సేవా సమితి ప్రతినిధుల ఆధ్వర్యంలో 2000 రూపాయల ఆర్థిక సాయం అందించారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.