Connect with us

Andhra

మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్‌లో ఉద్రిక్తత..

Published

on

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో ఈ రోజు ఉద్రిక్తత చోటుచేసుకుంది. ముండ్లమూరు హత్యకేసులో మార్కాపురం జిల్లా కోర్టుకు వాయిదా కోసం హాజరవుతున్న ముద్దాయిలపై గుర్తు తెలియని వ్యక్తి కారం చల్లి దాడి చేయబోయాడు.

ఆకస్మికంగా జరిగిన ఈ సంఘటనతో అక్కడున్న ప్రజలు భయాందోళనకు గురై కేకలు వేయగా, దాడి ప్రయత్నం చేసిన వ్యక్తి వెంటనే బస్సు దిగి పారిపోయాడు. ముద్దాయిలు వెంటనే బస్టాండ్ నుంచి వెళ్లిపోయారని స్థానికులు తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.