Connect with us

Andhra

పులివెందుల ఉప ఎన్నికలలో టిడిపిని గెలిపించండి ముస్లిం: ముస్లిం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రఫీ

Published

on

Shot News:జగన్ ముస్లింల సంక్షేమాన్ని గాలికి వదిలేసింది కాబట్టే 11 సీట్లు మాత్రమే వచ్చాయని ముస్లిం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రఫీ అన్నారు. ముస్లింలకు సంబంధించిన ప్రతి పథకాన్ని జగన్ గాలికి వదిలేసారని , ఆయన ప్రభుత్వంలో మైనార్టీ కార్పొరేషన్ పూర్తిగా ఉందో లేదో తెలియకుండా రద్దు చేశారని, ఉర్దూ పాఠశాలలు మూసివేశారని, ముస్లింలకు ఇస్తానన్న దుల్హన్ పథకం అమలు చేయలేదని, ముస్లింలకు ఒక్క పథకం కూడా అమలు చేయకుండా ఇప్పుడు పులివెందులలో ముస్లింల ఓట్ల కోసం ప్రాకులాడుతున్నారని ఆయన మండిపడ్డారు. పులివెందులలోని ముస్లింలు టిడిపికి ఓటు వేయాలని ఆయన కోరారు. అభివృద్ధి , సంక్షేమ ఒక్క చంద్రబాబుకే సాధ్యమని, హామీ ఇచ్చిన పథకం మహిళలకు ఉచిత ప్రయాణం.. ఆగస్టు 15 నుండి ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం టిడిపి ప్రభుత్వం అమలు చేయబోతుందని అని ఆయన తెలియజేశారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.