Connect with us

Andhra

ఏపిలో ఇక గంటకే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వాపస్..

Published

on

AP: రిజిస్ట్రేషన్ శాఖలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న మార్పులు చేస్తోంది. ఆస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియను డిజిటలైజేషన్ ద్వారా సులభతరం చేసిన ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ (IGRS) ద్వారా ఒక గంటలోపు పత్రాలు అందించేలా ఏర్పాట్లు చేసారు.

IGRS పోర్టల్ ద్వారా సబ్-రిజిస్ట్రార్ ఆఫీస్‌లో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు. ముందస్తు స్లాట్ బుక్ చేసిన వారు సబ్-రిజిస్ట్రార్ ఆఫీస్‌లో 10-15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేయవచ్చు. రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే, ఎన్‌కంబ్రెన్స్ సర్టిఫికెట్ (EC) , రిజిస్టర్డ్ డీడ్ వంటి పత్రాలు జారీ చేస్తారు. 2025 ఏప్రిల్‌లో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖ స్లాట్ బుకింగ్ సిస్టమ్‌ను ప్రారంభించారు. రిజిస్ట్రేషన్ సాఫ్ట్‌వేర్‌ను రాష్ట్ర రెవెన్యూ డేటాబేస్‌తో అనుసంధానం చేశారు, దీనివల్ల డాక్యుమెంట్ వెరిఫికేషన్ , జారీ వేగవంతమయింది. ఆధార్ ఆధారిత ఈ-కెవైసీ మరియు డిజిటల్ సంతకాలు రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తాయి, ఫలితంగా ఒక గంటలోపు పత్రాలు అందుతున్నాయి. గతంలోరిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత వారం రోజులకు డాక్యుమెంట్లు చేతికి వచ్చేవి.

అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వారు జనరల్ పవర్ అటర్నీ ద్వారా అమ్మకాలు ఇబ్బందికారంగా మారింది. GP చేసిన వారి ఆధార్ అనుసంధానం అయిన OTP లు తీసుకొవలసి ఉంటుంది.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.