Andhra
రైల్వే బ్రిడ్జిపై ప్రమాదం.. వ్యక్తి మృతి
ప్రకాశం జిల్లా మార్కాపురం రైల్వే ఓవర్ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం జరిగింది. బైకుపై వస్తున్న వ్యక్తి అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వివరాలు తెలియాల్సి ఉంది.
![]()
