Andhra
కరీంనగర్ జైలును సందర్శించిన ఎంపిజే బృందం*
కరీంనగర్: మూమెంట్ ఫర్ పీస్ &జస్టిస్ (MPJ) నాయకులు ఈరోజు కరీంనగర్ లో స్థానిక జైలును సందర్శించి, జైలు సూపరింటెండెంట్ విజయ్ డేనీ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అపరాధ రుసుము చెల్లించలేని నిరుపేద ఖైదీలు ఉంటే, ఎంపిజే వారికి అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమం లో MPJ వైస్ ప్రెసిడెంట్ ఆ నయీమ్, జాయింట్ సెక్రటరీ Sk. ఖాసిమ్, ఈసీ మెంబర్ ఇలియాస్ ఖాన్, కరీంనగర్ ప్రెసిడెంట్ నసీర్ ముజీబ్, ఖమ్మం ట్రెజరర్ Md. హకీమ్, సభ్యులు రహీమాన్, M. అబారీ తదితరులు పాల్గొన్నారు.
![]()
