Connect with us

Andhra

కానిస్టేబుల్ ఫలితాలలో ఇద్దరు అన్నదమ్ములకు ఉద్యోగాలు..

Published

on

  1. యర్రగొండపాలెం: పోలీసు ఉద్యోగానికి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఖాకీ చొక్కా యూనిఫామ్‌గా ధరించి.. నెత్తిన టోపీ పెట్టుకొని చేతిలో లాఠీ పట్టుకోవాలని ఎంతో మంది యువత కలలు కంటుంటారు. తమ కలల కొలువు కోసం తీవ్రంగా శ్రమిస్తారు. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువత ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన కానిస్టేబుల్‌ ఉద్యోగాల ఫలితాల్లో యువత సత్తాచాటారు. దీంతో ఆశల కొలువు దక్కించుకున్నవారు సంబరాల్లో మునిగి పోయారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం లోని ఓ హెడ్ కానిస్టేబుల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ లో విధులు నిర్వహిస్తున్న షేక్ బాజీ బాబు ( హెడ్ కానిస్టేబుల్ ) యొక్క ఇద్దరు కుమారులు షేక్ సాదిక్, షేక్ సాజిత్ అన్నదమ్ములు సివిల్ కానిస్టేబుల్‌ కొలువులు సాధించడం గమనార్హం. తమ ఇద్దరు పిల్లలు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడాన్ని కుటుంబ సభ్యులంతా మురిసిపోతున్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.