Andhra
న్యాయవాదుల క్రికెట్ పోటీలో విజేతగా నిలిచిన అన్వర్ బేగ్ టీమ్..
స్వాతంత్ర దినోత్సవo పురస్కరించుకొని స్థానిక SVKP కళాశాలలో ప్రకాశం జిల్లా మార్కాపురం బార్ అసోసియేషన్ & స్పోర్ట్స్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం న్యాయవాదుల క్రికెట్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో మూడు టీములు పాల్గొనగా రెండు మ్యాచ్లలో న్యాయవాది మొగల్. అన్వర్ బేగ్ టీమ్ ఉత్తమ ప్రతిభ కనబరిచింది. ఫైనల్ మ్యాచ్ లో ఏడు వికెట్ల తేడాతో విజేతగా నిలిచింది. ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో అద్భుతమైన ప్రతిభ కనబరిచి కప్పు గెలిచిన బృంద సభ్యులకు స్వాతంత్ర దినోత్సవo నాడు న్యాయమూర్తుల చేతుల మీదుగా కప్పు అందుకోనున్నారు. ఈ మేరకు విజేతలకు తోటి న్యాయవాదులు, కోర్ట్ సిబ్బంది అభినందనలు తెలిపారు.
![]()
