Andhra
క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశం నుంచి బిజెపి కూటమి పార్టీలను తరిమికొట్టండి.. జె.డి శీలం, శ్రీ షేక్ సైదా, సుధాకర్ పిలుపు
చీమకుర్తి: ప్రకాశం జిల్లా చీమకుర్తి పట్టణంలోని J&M కన్వెన్షన్ సెంటర్ నందు సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్తగా పసుమర్తి సుధాకర్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ ప్రణాళిక సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముందు గాంధీ నగర్ లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద నుండి J&M కన్వెన్షన్ సెంటర్ వరకు బారి ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో భాగంగా పట్టణంలో ఏర్పాటుచేసిన జాతీయ మరియు ప్రముఖ నాయకుల విగ్రహాలకు పూల మాలలు వేసి ఈ ర్యాలీ కొనసాగింది. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా అధ్యక్షుడు జరిగిన సభలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ కేంద్ర మంత్రి మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేడీ శీలం మాట్లాడుతూ “బీజేపీ పాలనలో భారతదేశం నాసినం అయ్యింది. రాజ్యాంగ సంస్థలను తమ స్వార్థానికి వాడుకుంటున్నాయి. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ సందేశాన్ని గ్రామ స్తాయి వరకు తీసుకెళ్లాలి.బీజేపీ ఏ విధంగా దొంగ ఓట్లతో ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వస్తుందో, రాజ్యాంగం ప్రజల ఓటు హక్కును హరించి వేస్తూ, ప్రజలను మోసం చేస్తుందో గ్రామ స్తాయి వరకు తెలియజేయాలిఅని అన్నారు.
ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షులు శ్రీ షేక్ సైదా మాట్లాడుతూ “స్వతంత్ర ఉద్యమంలో ఆగస్టు 8న తారీకునే గాంధీ క్విట్ ఇండియా పిలుపునిచ్చారు. అదే స్ఫూర్తితో బీజేపీనీ అధికార పీఠం మీద నుండి తరిమికొట్టాలి. ఈ నెల ఆఖరికల్లా మండల కమిటీలను పూర్తి చేయాలి అని నియోజకవర్గ సమన్వయకర్తలకు దిశా నిర్దేశం చేశారు. దేశ స్థాయిలో రాహుల్ గాంధీ, రాష్ట్ర స్థాయిలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటి (PCC) అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ షర్మిలా రెడ్డి ను స్పూర్తిగా నాయకులు పని చేయాలి అని, పార్టీ కోసం మనం ఏం చేస్తున్నామో ఆత్మ పరిశీలన చేసుకోవాలి” అని అన్నారు. ఈ సందర్భంగా సంతనూతలపాడు నియోజకవర్గ నూతన సమన్వయకర్త పసుమర్తి సుధాకర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పట్ల బలమైన గొంతుకగా ఉంటానని అన్నారు, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా అన్నారు. ఇండియా యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినం సందర్భంగా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి & యర్రగొండపాలెం నియోజకవర్గ కాంగ్రెస్ కోఆర్డినేటర్ విజేష్ రాజ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా పార్టీ ఇంచార్జి గడ్డం పాల్ విజయ్ కుమార్, బాపట్ల DCC మాజీ అధ్యక్షులు & రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంటా అంజి బాబు, టి. వెంకటేశ్వర్లు, సంతనూతలపాడు ఎర్రగొండపాలెం నియోజకవర్గ సమన్వయకర్త పాలపర్తి విజేశ్ రాజ్, గిద్దలూరు సమన్వయకర్త పగడాల రంగ స్వామి, కనిగిరి సమన్వయకర్త సుబ్బా రెడ్డి, మన్నం ప్రసన్న రాజు, నట్టే సుబ్బారావు, తుమ్మల సుబ్బారావు, కొప్పుల శంకర్, వేల్పుల వెంకటేశ్వర్లు, ఇరిగినేని వెంకట నరసయ్య, గోరంట్ల కోటేశ్వరరావు, బొడ్డు సతీష్, మహమూద్ రఫీ అహ్మద్, షేక్ రెహానా భాను, సుధీర్ వర్మ, దుంపా యలమందా రెడ్డి ఎజ్రా, గురు బాబు, శంషీర్ అలీ, పిల్లి వెంకటేశ్వర రెడ్డి, పాలంకర్ రెడ్డి, వేల్పుల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు, చీమకుర్తి పట్టణంలో కాంగ్రెస్ జెండాలతో ఫ్లెక్సీలతో పట్నాన్ని అందంగా అలంకరించారు దాదాపు రెండు కిలోమీటర్లు మేర పార్టీ పతాకాలంలో పాదయాత్ర నిర్వహించారు.
![]()
