Andhra
అట్టహసంగా ప్రారంభమైన న్యాయవాదుల క్రికెట్ పోటీలు..
ప్రకాశం జిల్లా మార్కాపురం బార్ అసోసియేషన్ & స్పోర్ట్స్ కమిటీ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవo పురస్కరించుకొని స్థానిక SVKP కళాశాలలో న్యాయవాదుల క్రికెట్ పోటీలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జిల్లా ఆరో అదనపు న్యాయమూర్తి ఎం. శుభవాని గారి చేతులమీదుగా ప్రారంభమైన ఈ పోటీల్లో న్యాయవాదులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి కిషోర్ కుమార్ మ్యాచ్ లో అద్భుత ఆటతో మెప్పించారు. కార్యక్రమంలో అదనపు మొదటి తరగతి న్యాయమూర్తి ఎం.బాలాజీ, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు సయ్యద్ అలీ జహిర్, వి. నాగేంద్ర కుమార్, స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ ఎం. సుబ్బారెడ్డి, జూనియర్, సీనియర్, న్యాయవాదులు, కోర్ట్ సిబ్బంది పాల్గొన్నారు.
![]()
