Connect with us

Andhra

మార్కాపురం మాస్టర్ ప్లాన్ సమావేశం..

Published

on

ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపాలిటీలో మాస్టర్ ప్లాన్ సదస్సు పట్టణంలోనీ శుభం కళ్యాణ మండపంలో జరిగింది. స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, మున్సిపల్ కమిషనర్, ఎమ్మార్వో, ప్లానింగ్ ఆఫీసర్ పాల్గొని అవగాహన కల్పించారు. టౌన్ బౌండరీని విస్తరించి దరిమడుగు, ఈడుపూరు, రాయవరం, పెద్దనాగులవరం, చిన్ననాగులవరం గ్రామాలు చేర్చారు. రాబోయే 2041లో జనాభా 1.5 లక్షలు దాటనుండటంతో రోడ్లు వైడెన్ చేసి 30 అడుగుల రోడ్లు 60 అడుగులుగా, కొత్త ఆరు లైన్ రోడ్లు ప్రతిపాదించారు. అభ్యంతరాలు ఉంటే రెండు నెలల్లో అర్జీలు సమర్పించాలని సూచించారు. లేఅవుట్లు అప్రూవ్ చేసుకోవాలని, లేకపోతే చెల్లవని ఈ సందర్భంగా హెచ్చరించారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.