Andhra
*గుంటూరు పశ్చిమ న ఘనంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి జన్మదిన వేడుకలు*
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి జన్మదిన వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్డీయే కూటమి నేతలు, కార్పొరేట్లు అభిమానులు ఘనంగా నిర్వహించి, పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు. ప్రధానంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి సుఖవాసి శ్రీనివాస రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ కేక్ ను ఎన్డీయే కూటమి నేతలు కట్ చేసి,తినిపించుకున్నారు. నియోజకవర్గ మైనారిటీ సెల్ అధ్యక్షులు అబ్దుల్ రహీం ఆధ్వర్యంలో హజరత్ కాలే మస్తాన్ వలి బాబా దర్గాలో ముస్లిం సోదరులు ఎమ్మెల్యే గళ్ళా మాధవి సుఖసంతోషాలతో ఉండి, ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గాలం వెంకటేశ్వర్లు,నన్నే, తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో చుట్టుగుంట సెంటర్ నుండి భారీ బైక్ ర్యాలీ నిర్వహించి వందలాది మందికి అన్నదానం నిర్వహించారు. బాషా హోటల్ సెంటర్ బుడే, 28వ డివిజన్ అధ్యక్షులు అప్పారావు యాదవ్ ల ఆధ్వర్యంలో అన్నదానం, కేక్ కటింగ్ నిర్వహించారు. 22వ డివిజన్ అధ్యక్షులు చింతకాయల సాయి ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కటింగ్ నిర్వహించారు. గుజ్జనగుండ్లలో మైనారిటీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుస్తుం బాబు ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు పీపీ కిట్లు, గ్లాసులు, మాస్కులు పంపిణీ చేశారు. ఫాతిమాపురం మున్సిపల్ స్కూల్ లో కేక్ కటింగ్ నిర్వహించి, విద్యార్థులకు ఉచిత అన్నదానం నిర్వహించారు . 36వ డివిజన్ అధ్యక్షులు తెలంగాణ శ్రీను ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు అందజేశారు. వడ్డెర కార్పోరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వర రావు ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అన్నదానం నిర్వహించారు. ఇలా అన్ని డివిజన్ లలో భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….
గల్లా మాధవి జన్మదినాన్ని సేవా రూపంలో జరుపుకోవడం ఆమె ప్రజాసేవ పట్ల అంకిత భావాన్ని ప్రతిబింబిస్తోందని, సంప్రదాయ వేడుకలకు భిన్నంగా, ఈ వేడుకలు సమాజానికి ఉపయోగపడే దిశగా కొనసాగినవన్నారు. గల్లా మాధవి ఎమ్మెల్యే ఎన్నికైనప్పటి నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, ప్రజల మౌలిక అవసరాలకు శాశ్వత పరిష్కారాలు అందిస్తున్నారన్నారు. రోడ్లు, డ్రైనేజీ, బీటీ రోడ్ల నిర్మాణం, స్ట్రీట్ లైట్లు ఏర్పాటు, మహిళా సంక్షేమం కోసం గృహ రుణాలు, ట్రైనింగ్ సెంటర్ల ఏర్పాటు చేశారని నాయకులు కొనియాడారు. ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటి పరిష్కారానికి ప్రాధాన్యం ఇచ్చే నాయకురాలిగా గల్లా మాధవి ప్రజల హృదయాల్లో నిలిచారని తెలిపారు.
![]()
