Connect with us

Andhra

‘వైసిపి రాష్ట్ర మైనారిటీ విభాగం అధికార ప్రతినిధిగా’ గౌస్ మొహియుద్దీన్

Published

on

వైసిపి అధినేత వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా, మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గం, మార్కాపురం పట్టణానికి చెందిన సయ్యద్ గౌస్ మొహిద్దీన్ ని వైయస్సార్ సిపి ఆంధ్రప్రదేశ్ “రాష్ట్ర మైనారిటీ విభాగ అధికార ప్రతినిధి” గా నియామకం చేసినట్లు తాడెపల్లి నుంచి ఉత్తర్వులు జారీచేశారు. గౌస్ మొహియుద్దీన్ తన స్వంత ట్రస్టు ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా, వైసిపి పార్టీకి విధేయత కనపరస్తూ.. పార్టీ కోసం గత రెండు ఎన్నికల్లో అభ్యర్థుల విజయం కోసం కృషి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాకు ఈ పదవి ఇచ్చిన పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి, పదవి వచ్చెందుకు కృషి చేసిన మార్కాపురం వైసిపి ఇంఛార్జి అన్నా వెంకట రాంబాబు, మాజీ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాలకు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.