Connect with us

Andhra

పోలీస్ ఫలితాల్లో మెరిసిన బీసీ కళాశాల వసతి గృహ విద్యార్థులు..

Published

on

కర్నూలు జిల్లా ఎమ్మిగనూర్ పట్టణం నందు గుడికెల్ బైపాస్ ప్రభుత్వ బీసీ బాలుర కళాశాల వసతి గృహం ఆదోని కి చెందిన ఏడు మంది విద్యార్థులు కురువ వీరేష్, లక్ష్మన్న, మల్లికార్జున, రజనీకాంత్, రామకృష్ణ నాయక్, యూసఫ్, సి వీరన్న ఎమ్మిగనూరు హాస్టల్ కు సంబంధించి నలుగురు విద్యార్థులు, టీ మదిలేటి, ఎస్ రహంతుల్లా, కే కుమార్, డి మహేష్ కు చెందిన మంత్రాలయం మరియు ఆదోనికి సంబంధించి ముగ్గురు విద్యార్థులు తాయన్న, గురురాజు, హనుమంతు మొత్తం 14 మంది విద్యార్థులు ప్రభుత్వం ప్రకటించిన కానిస్టేబుల్ ఫలితాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించారని వసతి గృహ సంక్షేమ అధికారులు సి విశ్వనాథరెడ్డి మరియు కె అబ్దుల్ అజీమ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా వారిని సన్మానిస్తూ బీసీ హాస్టల్ విద్యార్థులు కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని మరియు ఈ హాస్టల్స్ అనేవి విద్యార్థులకు మంచి ప్లాట్ఫామ్స్ అని కావున అందరూ మంచిగా సద్వినియం చేసుకోవాలని వారు తెలియజేశారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.