Andhra
తనదిగా వైరల్ అవుతున్న వీడియో ఫేక్: నశీర్ అహ్మద్
Shot News:సోషల్ మీడియా ద్వారా వైరల్ అవుతున్న వీడియో ఫేక్ అని అసెంబ్లీ మైనార్టీ కమిషన్ చైర్మన్ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ షార్ట్ న్యూస్ కు తెలిపారు. వీడియోకు సంబంధించి నేను స్పందించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నానుఅని, ప్రజాప్రతినిధిగా తన మీద తప్పుడు ఆరోపణలు చేయడానికి ఎడిటెడ్ వీడియోలు, ఫేక్ కంటెంట్ ను వ్యాప్తి చేయడం రాజకీయ నైతికతకి పూర్తి విరుద్ధం అన్నారు.ఈ వీడియో పూర్తిగా ఫేక్ గా తయారు చేయబడిందని స్పష్టం చేస్తున్నాను అని తెలుపుతూ, ప్రజల మద్దతు కోల్పోయిన, ఒక వైఫల్యమైన వర్గం మాకు మద్దతుగా ఉన్న ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు, నా ప్రతిష్టను దెబ్బతీయడానికి ఇలా కావాలని కుట్రపూరితంగా ఈ విధమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి అని, నిజం త్వరలోనే వెలుగులోకి వస్తుంది. న్యాయపరంగా కూడా ఈ విషయాన్ని మేము ఎదుర్కొంటాం అన్నారు.ఈ వీడియోకు సంబంధించి ఇప్పటికే దర్యాప్తు జరుగుతుంది. తన తరఫునుండి అందరికీ ఒక మనవి ఇలాంటి నకిలీ ప్రచారాలను నమ్మవద్దు. నిజం వైపు నిలబడండి అని తెలియజేస్తున్నాను ప్రజలను కోరారు.
![]()
