Andhra
పోలీసుల విజయం – రూ.50 లక్షల విలువైన 250 మొబైల్ ఫోన్లను రికవరీ
🚩 గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్‌లో ఈరోజు (03.08.2025) జరిగిన కార్యక్రమంలో దొంగిలించబడిన మరియు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను ఎస్పీ శ్రీ సతీష్ కుమార్, ఐపీఎస్ బాధితులకు స్వయంగా అందజేశారు. ఈరోజు మొత్తం రూ.50 లక్షల విలువ కలిగిన 250 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేయగా, ఇప్పటి వరకు 3115 ఫోన్లను ప్రజలకు అందజేసినట్లు తెలపడం జరిగింది.
👉 ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…
> “ప్రస్తుత కాలంలో సెల్ ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో విడదీయలేని భాగంగా మారింది. సెల్ ఫోన్ పోవడం వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజలు తమ ఫోన్ పోయిన వెంటనే CEIR వెబ్‌సైట్ ద్వారా లేదా 8688831574 నెంబర్‌కు ఫిర్యాదు చేయాలి. అలాగే, నేరుగా 1930 నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్‌కు సమాచారం ఇవ్వాలి.”
📱 సెల్ ఫోన్ల పోగొట్టకానికి ప్రధాన కారణాలు :-
1. ఫోన్‌లను జేబులో నిర్లక్ష్యంగా పెట్టుకోవడం.
2. షాపింగ్ లేదా ప్రయాణ సమయంలో ఫోన్‌ను పక్కన ఉంచి మర్చిపోవడం.
3. పబ్లిక్ ప్రదేశాల్లో ఫోన్‌ను జాగ్రత్త లేకుండా వదిలేయడం.
4. ఆఫీస్/పని ప్రదేశాల్లో చార్జింగ్ పెట్టి, బ్యాగుల్లో పెట్టీ పర్యవేక్షించకపోవడం.
⭕ సైబర్ నేరాలపై హెచ్చరిక :-
సెల్ ఫోన్ల ద్వారా ఎక్కువగా ఆర్థిక లావాదేవీలు జరుగుతున్న నేపథ్యంలో, ప్రజలు సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. నకిలీ ఫోన్ కాల్స్ ద్వారా మోసాలు జరుగుతున్నందున అలాంటి కాల్స్‌కి భయపడకుండా వెంటనే బ్లాక్ చేసి, సమీప పోలీస్ స్టేషన్ లేదా 1930 నంబర్‌కి ఫిర్యాదు చేయాలని తెలిపారు.
💐 అభినందనలు :-
మొబైల్ ఫోన్ల రికవరీలో విశేషంగా కృషి చేసిన IT Core CI శ్రీ నిషార్ భాషా గారు, హెడ్ కానిస్టేబుల్ కిషోర్ గారు, కానిస్టేబుళ్ళు శ్రీధర్ గారు, మానస గారు, CCS హెడ్ కానిస్టేబుల్ రమేష్ గారు మరియు కానిస్టేబుల్ కరీముల్లా గారిని ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.
![]()
