Andhra
#హెచ్ పివి రెండవ డోస్ ఉచితంగా వేసిన హోప్ విన్ హాస్పిటల్
లక్ష రూపాయల విలువ కలిగిన హెచ్ పి వి వ్యాక్సిన్ 70 మంది యువతులకు ఉచితంగా అందజేత
గుంటూరు : ఇన్ఫెక్షన్ ల వల్ల వచ్చే కొన్ని రకాల క్యాన్సర్లను నివారించడానికి హెచ్ పి వి ( హ్యూమన్ పాపిలోమా వైరస్ )వ్యాక్సిన్ దోహదపడుతుందని ఆబ్స్టేట్రిషిన్, గైనకాలజిస్ట్, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ షమ సుల్తానా తెలిపారు. ఆదివారం హోప్ విన్ హాస్పిటల్స్’ చైర్ పర్సన్ డాక్టర్ షమా సుల్తానా మరియు ఫౌండర్ డాక్టర్ నజీరుద్దీన్ ఆధ్వర్యంలో స్థానిక గుంటూరువారి తోట 7వ లైనులో ఉన్న హోప్ విన్ హాస్పిటల్స్ ప్రాంగణం నందు 20 సంవత్సరాల లోపు వయసున్న 70 మంది యువతులకు ప్రాజెక్ట్ సర్విక హెచ్ పి వి వ్యాక్సిన్ రెండవ డోసు ఉచితంగా వేశారు. ఈ సందర్భంగా డాక్టర్ షమా సుల్తానా మాట్లాడుతూ ఈ వ్యాక్సిన్ కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ నివారించడమే కాకుండా గర్భాశయ క్యాన్సర్, జననేంద్రియ మొటిమలు రాకుండా నిరోధిస్తుందన్నారు. 9 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల వయసు ఆడ మగ ఇద్దరికి కూడా ఈ టీకా ను సిఫార్సు చేయడం జరుగుతుందని, అలాగే గొంతు క్యాన్సర్ల నుండి రక్షించడంలో ఈ వ్యాక్సిన్ ఎంతో సహాయపడుతుందని ఆమె పేర్కొన్నారు. అదేవిధంగా రోగ నిరోధక వ్యవస్థను 9 నుండి 14 సంవత్సరాల వారిలో అతి ప్రభావవంతంగా ఉంటుంది ఆ సమయం లో ఈ వాక్సిన్ వేపించడం చాలా లాభదాయకం, ఒకవేళ ఈ వైరస్ బారిన పడినట్లయితే వ్యాధి వృద్ధి చెందకుండా ఈ వ్యాక్సిన్ నిరోధిస్తుందని డాక్టర్ షమా సుల్తానా వెల్లడించారు
![]()
