Andhra
పోలీస్ కానిస్టేబుల్స్ ఫలితాలలో “రేస్” కోచింగ్ సెంటర్ ప్రభంజనం..
ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు (APSLPRB) నేడు ప్రకటించిన పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలలో ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ‘రామానుజన్ అడమీ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్’ (రేస్) సంస్థలో శిక్షణ పొందిన ’24 మంది కానిస్టేబుళ్ళుగా ఎంపికైనట్లు ‘రేస్ కోచింగ్ సెంటర్ గౌరవ సలహాదారులు సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలాని, డైరెక్టరు బత్తుల లక్ష్మీనారాయణలు తెలిపారు. ‘రేప్’ కోచింగ్ సెంటర్ లో శిక్షణ పొందిన విద్యార్థులలో 11 మంది సివిల్ కానిస్టేబుల్స్, 13 మంది ఏ.పి.యస్.పి APSP) కానిస్టేబుల్స్ గా ఎంపికైనట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు. ‘రేస్’ సంస్థలో శిక్షణ తీసుకున్న విద్యార్థులలో టి. దిలీప్ కుమార్ (HT NO 4436971) 145 మార్కులు; జి. సురేంద్ర కుమార్ (HT NO 4209339) 144 మార్కులు; కె రాజేష్ (HT NO 4 197855) 143 మార్కులు, షేక్ మహబూబ్ జాని (HT ΝΟ 4229281) 142 మార్కులు; ఎస్ అనిల్ కుమార్ (HTNO 4257369) 141 మార్కులు పొందినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమములో కానిస్టేబుల్స్ ఎంపికైన విజేతలను అభినందించారు. “రేప్’ కోచింగ్ సెంటర్లో అత్యుత్తమ శిక్షణ, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం, క్రమం తప్పకుండా పరీక్షల నిర్వహణ వల్ల తాము ఉద్యోగాలు సాధించగలిగామని అర్హత సాధించిన అభ్యర్థులు తెలిపారు. ఈ కార్యక్రమములో అధ్యాపకులు నాగేశ్వరరావు, శ్రీను, సుబ్బయ్య, నర్సయ్య, వెంకట్ మరియు ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.
![]()
