Andhra
అంతరించిపోతున్న మానవత్వం, పట్టణాలకే పరిమితమైన విష సంస్కృతి నేడు పల్లెలకు కూడా…..
విలాసాలు, వినోదాలు, బెట్టింగ్ యాప్లు, విచ్చలవిడి మద్యం విక్రయాలు, విష సంస్కృతిని వ్యాప్తి చేసే సోషల్ మీడియా, ఆవేశం, అర్ధంపర్ధంలేని పట్టుదల, నిలకడలేని మనస్తత్వం, స్వార్థ ప్రయోజనాలతో నేటి సమాజంలో నేర సంస్కృతి ప్రబలిపోతోంది. మానవత్వం మృగ్యమైపోతోంది. మనిషి మృగంలా మారిపోతున్నాడు. ఒకప్పుడు నగరాలు, పట్టణాలకే పరిమితమైన ఈ విష సంస్కృతి నేడు పల్లెల్లోకి కూడా పాకడం ఆందోళన కలిగించే విషయం.క్షణికావేశంలో హత్యలు చేసి ఎందరో జైలుపాలై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ప్రతి సమస్యకు పరిష్కార మార్గాలు ఉంటాయి. ఒక హత్య వలన బాధిత కుటుంబం,నిందితుడి కుటుంబం రెండూ చిన్నాభిన్నమవుతాయి.ఇటీవల పెరిగిపోతున్న హత్యలకు కారణాలు ప్రభుత్వాల వైఫల్యమే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విష సంస్కృతిపై దృష్టి సారిస్తే నేరాలను అదుపు చేయవచ్చు మేధావులు అంటున్నారు.
![]()
