Connect with us

Andhra

నేటి విద్యార్థులే.. రేపటి శాస్త్ర వేత్తలు.. రమేష్, జగన్నాధ్

Published

on

ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్ స్థాయి సైన్స్ టీచర్స్ ఓరియెంటేషన్ కార్యక్రమంలో భాగంగా ఇన్ఫైర్ మనక్ 2025-26 స్ధానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నతపాఠశాల ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. విజ్ఞాన శాస్త్ర సాంకేతిక రంగాల్లో విద్యార్థులకు మక్కువ పెంచే విధంగా.. సృజనాత్మకమైన, పర్యావరణ హితమైన, నిత్య నూతనత్వంతో కూడిన.. సామాజిక సమస్యలకు చక్కటి పరిష్కారం సూచించే విధంగా, నూతన ఆవిష్కరణలను ప్రోత్సాహించి, విద్యార్థుల ప్రాజెక్టులు రూపకల్పనలో మార్గదర్శనం చేసి, ప్రోత్సహించాలని జిల్లా సైన్స్ అధికారి టి.రమేష్ కోరారు.

మరో ముఖ్య అతిధి జాతీయ స్థాయి సైన్స్ అవార్డు గ్రహీత జాతీయ ఎన్విరాన్మెంటల్ కో ఆర్డినేటర్ తంగిరాల నాగ జగన్నాథ్ మాట్లాడుతూ.. తనకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది, సైన్స్ పట్ల ఉన్న మక్కువే అని, నూతన ఆవిష్కరణలకు తద్వారా ఆ ప్రాజెక్టులు అనేక అవార్డులు అందుకోవడానికి కారణం అని. ప్రతి సైన్స్ ఉపాధ్యాయులు ఇలాగే గుర్తింపు తెచ్చుకోవాలని పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారిణి కె. శర్వాణి, రిసోర్స్ పర్శన్స్ రవికాంత్, రాము, డివిజన్ పరిధిలోని ఉన్నతపాఠశాల సైన్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.