Connect with us

Andhra

వాహనదారులకు RTO, MVI ల హెచ్చరిక..

Published

on

ప్రకాశం జిల్లా మార్కాపురం ఆర్టీవో కార్యాలయంలో ప్రెస్ మీట్‌లో RTO చందన, MVI మాధవరావులు మాట్లాడుతూ ..జూలై 31 లోగా త్రైమాసిక పన్ను చెల్లించని వాహనాలపై సీజ్ చర్యలు తీసుకుంటామని తెలిపారు. వినియోగంలో లేని వాహనాలను వెబ్‌సైట్‌లో నమోదు చేస్తే పెనాల్టీ తప్పిస్తారని చెప్పారు. రోడ్ సేఫ్టీపై ప్రతి వారం అవగాహన కార్యక్రమాలు, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్‌లోడింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు. స్కూల్ బస్సులకు ఫిట్నెస్, లైసెన్స్ తప్పనిసరి అని, ఫిట్‌నెస్ లేని 95 బస్సులపై చర్యలు ప్రారంభించినట్లు చెప్పారు. 15 ఏళ్ల వయస్సు పైబడిన వాహనాలను విద్యార్థుల రవాణాకు వాడరాదని హెచ్చరించారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.