Connect with us

Andhra

డ్రోన్ ద్వారా పంట పిచికారి ప్రారంభించిన ఎమ్మెల్యే కందుల..

Published

on

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగులో బుధవారం పంట పిచికారి కోసం డ్రోన్‌ను ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు రైతు కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి, రైతుల కష్టాలను బాగా తెలుసన్నారు. సంప్రదాయ పద్ధతిలో ఒక ఎకరాకు ఒక రోజు పట్టే పిచికారిని డ్రోన్ సాయంతో నిమిషాల్లో చేయొచ్చని తెలిపారు. ఇది వ్యవసాయ రంగంలో పెద్ద మార్పుగా నిలుస్తుందన్నారు. ఆగస్ట్ 2న అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు రూ.7,000 చొప్పున మద్దతు నిధులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.