Andhra
మతం పేరుతో విధి నిర్వహణలో ఉన్న డ్రైవర్ ను ఆటంక పరిచిన సిబ్బందిని తొలగించాలి.. యంపీజే డిమాండ్
నంద్యాల జిల్లా ఆత్మకూరు డిపోకు చెందిన డ్రైవర్ తన విధి నిర్వహణ నిమిత్తం ఎప్పటిలాగే శ్రీశైలంకు వెళ్లే క్రమంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆలయ గేట్ సెక్యూరిటీ సిబ్బంది టోపి తీస్తే నే అనుమతి ఇస్తామని చెప్పడం.. అందుకు అతను వ్యతిరేకించడంతో బండి ఆపాలని కానిస్టేబుల్ ద్వారా వత్తిడి తేవడం..ఆర్టీసి అధికారులు మాకు ఆదేశిస్తే ఈ రూటుకు విధులకు హాజరు కామిని చెప్పడం..ఈ వీడియో వైరల్ కావడంతో.. విధి నిర్వహణ చేసే ఉద్యోగులు ప్రయాణికులకు గమ్యాన్ని చేరే వేసే వరకు మాత్రమే వారి బాధ్యత. అటు వంటి వ్యక్తిని మతం కోణంతో చూసి ఆటంక పరిచిన సెక్యూరిటీ సిబ్బందిని సంబంధిత అధికారులు తప్పించాలని మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (యంపీజే) రాష్ట్ర అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్ డిమాండ్ చేశారు. ఈ విషయం గురించి ఆయన డిపో మెనేజర్ తో ఫోన్లో మాట్లాడటం జరిగింది. ఆయన మరియు ఆర్టీసీ అధికారులు ఈ విషయం గురించి సీరియస్ గా ఆలయ ఈవోతో మాట్లాడి రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. సెక్యూరిటీ సిబ్బందిలోని మత మౌఢ్యం గల వ్యక్తి కావాలనే మతపరంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడా..? లేదా కూటమి ప్రభుత్వం ఈ విధంగా ఆదేశించారు జారి చేశారా అని యంపీజే ప్రశ్నిస్తుంది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కారణమైన సెక్యూరిటీ సిబ్బందిని వెంటనే తొలగించాలని యంపీజే డిమాండ్ చేస్తుంది.
![]()
