Andhra
ఆర్టీసీ బస్సులలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్
ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి బ్యాగులు, ల్యాప్ టాపులు చోరీ చేస్తున్నాడు. అతన్ని ప్రకాశం జిల్లా ఒంగోలు 1వ టౌన్ సిఐ వై నాగరాజు ఆధ్వర్యంలో పోలీసులు అరెస్టు చేశారు. నెల్లూరు జిల్లా కందుకూరుకు చెందిన వీసా రమేష్ బాబు అనే వ్యక్తి రెండేళ్లుగా ఒంగోలు బస్టాండు ప్రాంతంలో ఈ నేరాలకు పాల్పడుతున్నాడు. అతడి వద్ద నుంచి రూ.2.5 లక్షల విలువైన 10 ల్యాప్ టాపులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
![]()
