Connect with us

Andhra

పీడితులకు బాసటగా యంపిజే నిలబడాలి.. రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ రజాక్ పిలుపు

Published

on

≅మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిన్ కాకినాడ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ హలీమ్ అధ్యక్షతన ఉత్తర ప్రాంతీయ మహాసభ కాకినాడలో ఘనంగా జరిగింది. ఈ సందర్భముగా సభాధ్యక్షులు హలీమ్ మాట్లాడుతూ.. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా అందరికి శాంతి, న్యాయం, సమానత్వం కోసం నిరంతరం పోరాడుతున్నా సంస్థ యంపీజే అని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సూచనల మేరకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలైన రాజమండ్రి, కోనసీమ, కాకినాడ జిల్లాలతో కలిపి ఉత్తర ఆంధ్ర మహాసభ నిర్వహించామని అన్నారు. ఈ సభకు గౌరవ ముఖ్య అతిధిగా పాల్గొన్న రాష్ట్ర అధ్యకులు అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ.. యంపీజే సమాజంలో అవసరార్థులకు తోడుగా ఉంటుందని, దేశంలో ప్రభుత్వ రంగాలన్ని ప్రభుత్వానికి పూర్తిగా దాసోహమయ్యాయని, రాజ్యాంగాన్ని సంరక్షణ కొరకు పాటుపడాలని పిలుపు ఇచ్చారు. కాకినాడ, రాజమండ్రి, అమలాపురం జిల్లాల అధ్యక్షులు తమ జిల్లాలలో సంస్థ బలోపేతం గురించి వివరించారు. ప్రత్యేక అతిథిగా విచ్చేసిన APCR రాష్ట్ర అధ్యక్షులు పిచ్చుక శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రాజ్యాంగ పరిధిలో మానవ హక్కులు-ఉల్లంఘన-వాటి పరిష్కారము గురించి అవగాహన కల్పించారు. రాష్ట్ర సుప్రీం కౌన్సిల్ కన్వీనర్ యస్ ఎ ఖదీర్ మాట్లాడుతూ.. దేశంలో, రాష్ట్రంలోని ప్రజా సమస్యలను యంపీజే తన బాధ్యతగా గుర్తెరిగి పరిష్కారానికి కృషి చేయాలని, ప్రభుత్వానికి – ప్రజల మధ్య ఒక వారధిగా యంపీజే ఉండాలని అన్నారు. యంపీజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలీమ్ యం పి జె ఆశయాలు-లక్ష్యాలు -రాష్ట్ర విజన్ గురించి వివరించారు. యంపీజే రాష్ట్ర సుప్రీం కౌన్సిల్ సభ్యులు హుస్సేన్ యం పి జె నిభంధనావళి గురించి వివరించారు. రాష్ట్ర కోశాధికారి వలియా మాట్లాడుతూ.. ఉద్యమానికి డబ్బు ఆవశ్యకత గురించి వివరించారు. అనంతరము 8 మంది వివిధ ప్రాంతాలనుండి వచ్చిన పత్రికా విలేఖరులకు రాష్ట్ర కమిటీ వారిచే సన్మానించడం జరిగినది. మరో సుప్రీం కౌన్సిల్ సభ్యులు ఎం డి ఇబ్రహీం యంపిజె కార్యకర్తల శీల నిర్మాణము గూర్చి వివరించారు. రాష్ట్ర జేఐహెచ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనాబ్ మొహమ్మద్ కరీముద్దీన్ మాట్లాడుతూ.. యంపీజే నాయకులు, కార్యకర్తలు పలు ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని, వారికి అండగా ఉండెందుకు ప్రణాళికను రూపొందించుకోవాలని అన్నారు.  అనంతరం 15 మంది కొత్త సభ్యులు స్వచ్ఛందంగా యం పి జె లో చేరారు. వారిని అద్యక్షులు కండువాలతో సంస్థలో ఆహ్వానించడం జరిగింది. యంపీజే చేసిన కార్యక్రమాలను ప్రాజెక్ట్ ద్వారా తెలుపడం జరిగింది. చివరగా ఈ కార్యక్రమము వందన సమర్పణ మరియు జాతీయ గీతము జనగణమనతో కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమానికి కన్వీనర్లుగా అజహర్ మోహిద్దీన్, అబ్దుల్లాలు వ్యవహారించారు. ఈ కార్యక్రమంలో మూడు జిల్లాల యంపిజే ప్రతినిధులు, కడప జిల్లా అధ్యక్షుడు జాకీర్ ఉమ్రీ, కోనసీమ జిల్లా అధ్యక్షుడు ఖాదర్ వలీ, రాజమండ్రి సిటీ అధ్యక్షుడు సిద్దీఖ్, మండపేట అధ్యక్షుడు రహీం తదితరులు పాల్గొన్నారుü.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.