Connect with us

Andhra

మట్టిలో చేతులు… మనసులో దేశం CIO ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం

Published

on

Shot News:చిల్డ్రన్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ (సీఐవో) ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం హైదరాబాద్ సిటీ మొత్తం చేపడుతున్నట్లు జమాఅతె ఇస్లామీ హింద్, హైదరాబాద్ సిటీ ప్రెసిడెంట్ డాక్టర్ ముబష్షిర్ అహ్మద్ ప్రకటించారు.భావి భారత చిన్నారులకు పర్యావరణ స్పృహ పెంచేందుకు జమాఅతె ఇస్లామీ హింద్ అనుబంధ పిల్లల సంస్థ అయిన చిల్డ్రన్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామని డాక్టర్ ముబష్షిర్ అహ్మద్ తెలిపారు. ‘మట్టిలో చేతులు- మనసులో దేశం’ అంశంతో దేశవ్యాప్తంగా పది లక్షల మొక్కలు నాటే కార్యక్రమానికి నడుంబిగించామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ సిటీలో చిన్నారుల చేత పది వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామని ఆయన అన్నారు. పర్యావరణ అసమతౌల్యతతో ప్రకృతి విపత్తులు చోటు చేసుకుంటున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్తు ప్రమాదకరంగా మారుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జులై 4వ తేదీన పబ్లిక్ గార్డెన్ లో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఆయన తెలిపారు. పూలు, పండ్ల మొక్కలు పెంచడంలో పిల్లలను భాగస్వాముల్ని చేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. చిన్నారులు పచ్చని ప్రకృతి ఒడిలో పెరిగితే వారికి ఒత్తిడి తగ్గి మానసి ఉల్లాసం కలుగుతుందని డాక్టర్ ముబష్షిర్ చెప్పారు. చిన్నప్పటి నుంచే పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత అలవరిస్తే బాధ్యతా యుతమైన పౌరులుగా ఎదుగుతారని ఆయన చెప్పారు. ప్రతీ తల్లి దండ్రి తమ పిల్లలను ఈ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేయాలని పిలుపునిచ్చారు. నాటిన మొక్కల సంరక్షణ బాధ్యత కూడా ఈ పిల్లలు చూసుకునేలా వారికి అవగాహన కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.