Connect with us

Andhra

“కార్గిల్ విజయ్ దివస్” సందర్భంగా ఘనంగా నివాళులు..

Published

on

నేడు ” కార్గిల్ విజయ్ దివస్ ” సందర్భంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మరియు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని తర్లుపాడు రోడ్డులో ఉన్న అమరవీరుల స్తూపం వద్ద కార్గిల్ యుద్ధంలో అమరులైన జవాన్లకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్గిల్ యుద్ధంలో సైనికులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి దేశాన్ని కాపాడారని అలాగే అమరులైన సైనికుల త్యాగం వెలకట్టలేనిది కొనియాడారు. వారికి దేశం ఎప్పుడు రుణపడి ఉంటుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ఇమ్మడి కాశీనాథ్, పివి కృష్ణారావు, మార్కాపురం AMC చైర్మన్ మాలపాటి వెంకట రెడ్డి, మాజి మున్సిపల్ చైర్మన్ వక్కలగడ్డ రాధిక మల్లికార్జున్, మాజీ సైనికులు పాల్గొని నివాళులు అర్పించారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.