Connect with us

Andhra

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు డిఎస్పీలు మృతి

Published

on



AP: జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ఇద్దరు డీఎప్సీలు మృతి చెందారు. ఈ షాకింగ్ సంఘటన తెలంగాణలోని చౌటుప్పల్ మండలం కైతపురం వద్ద చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారు ఏపీకి చెందిన డీఎస్పీలుగా తెలుస్తుంది. వేగంగా వెళ్తున్న లారీ.. ఏపీకి చెందిన పోలీసులు వెళ్తున్న కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో కారులో ఉన్న డీఎస్సీ చక్రధరరావు, శాంతారావు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. అడిషనల్ ఎస్పీ ప్రసాద్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. అలాగే కారు డ్రైవర్ నర్సింగరావు పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా ఏపీకి చెందిన పోలీసు అధికారులు విజయవాడ నుండి హైదరాబాద్ వస్తుండగా మార్గమధ్యంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.